Mazaka First Review: సందీప్ కిషన్ పెద్ద హిట్టు కొట్టబోతున్నాడా?

గతేడాది సందీప్ కిషన్ (Sundeep Kishan) నుండి వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona)  ‘రాయన్’ (Raayan)..లు బాగానే ఆడాయి. ఇప్పుడు ‘మజాకా’ (Mazaka)  తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ధమాకా’ (Dhamaka) తో వంద కోట్ల సినిమా ఇచ్చిన త్రినాథ్ రావ్ నక్కిన  (Trinadha Rao) దీనికి దర్శకుడు. రీతూ వర్మ  (Ritu Varma)  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ‘మన్మధుడు’ హీరోయిన్ అన్షు (Anshu Ambani) రీ- ఎంట్రీ ఇస్తుంది. ఫిబ్రవరి 26న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. అది మీ కోసం :

Mazaka First Review:

కథ విషయానికి వస్తే… రమణ(రావు రమేష్) (Rao Ramesh) తన భార్య చనిపోవడంతో.. కొడుక్కి అన్నీ తానై పెంచుతాడు. ఇక అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అయితే ఒకసారి కృష్ణ మీరా(రీతూ వర్మ) ని చూసి ప్రేమలో పడతాడు. ప్రేమించమని ఆమె వెంటపడుతుంటాడు. మరోపక్క రమణ… తన కొలీగ్ అయినటువంటి యశోదని(అన్షు) చూడగానే ఇష్టపడతాడు. తర్వాత అతను కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే యశోదకి మీరా మేనకోడలు అవుతుంది.

భార్గవ్ వర్మ (మురళీ శర్మ) మీరాకి తండ్రి.. అలాగే యశోదకి అన్నయ్య. వీళ్ళ ప్రేమ,పెళ్లి వ్యవహారాలకు ఇతను వ్యతిరేకం. మరి భార్గవ్ వర్మని ఒప్పించి ఈ తండ్రీ కొడుకులు..ఆ మేనత్త, మేనకోడల్ని ఎలా పెళ్లాడారు? ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ అని అంటున్నారు. ‘మజాకా’ స్క్రీన్ ప్లే ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందట. 2 గంటల 30 నిమిషాల పాటు హిలేరియస్ గా ఉంటుందని చెబుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ ట్రాక్ వచ్చి బాగా నవ్విస్తుందని అంటున్నారు.

తండ్రీకొడుకులుగా రావు రమేష్- సందీప్ కిషన్లు బాగా సెట్ అయ్యారని, కామెడీ బాగా చేసారని అంటున్నారు. ఇక రీతూ వర్మ, అన్షు..ల గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. మురళీ శర్మ ఓ పక్క విలనిజం చూపిస్తూనే మరోపక్క కామెడీ పండించిన విధానం కూడా బాగుందంటున్నారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయట. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

4వ రోజు కూడా ఓకే అనిపించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus