సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో ‘మజాకా’ (Mazaka) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు (Anshu Ambani) కూడా కీలక పాత్ర పోషించింది. ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar) ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. టీజర్, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. సినిమాలో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కామెడీ ఉంటుందని అవి క్లారిటీ ఇచ్చాయి.
అలాగే ఈ సినిమా కచ్చితంగా సందీప్ కిషన్ కెరీర్లో హైయెస్ట్ నంబర్స్ చేస్తుంది అని అంతా భావిస్తున్నారు.సందీప్ కూడా ఈ విషయంలో ధీమా వ్యక్తం చేశాడు. ‘నా కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన సినిమా ‘ఊరు పేరు భైరవకోన'(Ooru Peru Bhairavakona) .. దాని కలెక్షన్స్ ను ‘మజాకా’ మొదటి వారం క్రాస్ చేస్తుంది’ అంటూ సందీప్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ ప్రీమియర్స్ కి కూడా ఏర్పాట్లు చేశారు.
అది మంచి విషయమే.. చిన్న సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ హెల్ప్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ వాటి టైమింగ్స్ చాలా ముఖ్యం. పెయిడ్ ప్రీమియర్స్ అన్నప్పుడు కొంచెం త్వరగా వేస్తే బాగుంటుంది. పెద్ద సినిమాలకి అయితే వేరే సంగతి. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి ఎంత త్వరగా వేస్తే అంత మంచిది. కానీ ‘మజాకా’ టీం ప్లానింగ్ వేరుగా ఉంది.
ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ రాత్రి 10 : 30కి అలా ఉన్నాయి. సినిమా రన్ టైం 2 : 30 గంటల. ఇక యాడ్స్, ఇంటర్వెల్ తో కలుపుకుని 3 గంటలు అనుకున్నా.. షో అయ్యేసరికి ఎంత కాదనుకున్నా ‘1’(AM) దాటేస్తుంది. మరీ అంత లేట్ గా వేయడం కూడా కరెక్ట్ కాదు అనేది కొందరి అభిప్రాయం. మరి చిత్ర బృందం ఆలోచన ఎలా ఉందో?