Mechanic Rocky Collections: జస్ట్ యావరేజ్ వీకెండ్.. ఇలా అయితే కష్టమే!
- November 25, 2024 / 06:16 PM ISTByFilmy Focus
మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ'(Mechanic Rocky). నవంబర్ 22న రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath)..లు హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మెకానిక్ రాకీ’ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్..లు బాగున్నాయని అంతా కొనియాడారు.
Mechanic Rocky Collections:

కానీ సరైన ఓపెనింగ్స్ రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది ఈ సినిమా. ఒకసారి (Mechanic Rocky ) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.19 cr |
| సీడెడ్ | 0.26 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.07 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.52 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.96 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 43.48 cr |
‘మెకానిక్ రాకీ’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ.3.48 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. విశ్వక్ సేన్ గత సినిమాలు ‘గామి’ (Gaami) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) సినిమాల రేంజ్లో ఈ సినిమా ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది.

















