త్వరలో చిరంజీవి టీవీ షో ప్రసారం మొదలు
- January 20, 2017 / 01:40 PM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి వెండి తెర రీ ఎంట్రీ విజయవంతమైంది. ఏడాది పాటు కష్టపడి ఖైదీ నంబర్ 150 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే బుల్లితెరలో తన ఎంట్రీ అదిరిపోవాలి అని చిరు ప్రయత్నిస్తున్నారు. మాటీవీ లో కింగ్ నాగార్జున చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు చిరంజీవి హోస్టుగా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఛానల్ ల్లో కొంతకాలంగా ప్రోమోలు కూడా ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ షో ప్రారంభమయ్యే తేదీని ప్రకటించలేదు.
ఫిల్మీ ఫోకస్ కి అందిన సమాచారం మేరకు వచ్చే నెల 12 నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్ మొదలు కానుంది. తొలి రోజు గెస్ట్ గా కింగ్ నాగార్జున రానున్నట్లు తెలిసింది. వీరి మధ్య జరిగే సంభాషణ అక్కినేని, మెగా అభిమానులను అలరిస్తుందని షో నిర్వాహకులు తెలిపారు. ఈ షో రేటింగ్ లో కొత్త రికార్డులు నమోదు చేస్తుందని మాటీవీ ఛానల్ వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















