Meera Chopra: ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా ఏంటి ఇలా అయిపోయింది.!

పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించిన ‘బంగారం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది మీరా చోప్రా. ఆ చిత్రంలో సంధ్య అనే అమ్మాయిగా నటించింది. నిజానికి ఈ చిత్రంలో ఆమె పవన్ కు జోడీగా నటించలేదు కానీ హీరో తర్వాత ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్న పాత్ర అని చెప్పొచ్చు. హీరో గోల్ కు అడ్డుపడే అమ్మాయిగా మీరాచోప్రా కనిపిస్తుంది. ఈమె ప్రేమను గెలిపించడానికి హీరో తన గోల్ ను సాక్రిఫైస్ చేస్తాడు.

అయితే ఇది జనాలకు ఎక్కలేదు. అందుకే సినిమా ప్లాప్ అయ్యింది. సినిమా ప్లాప్ అవ్వడం వల్లనే కాకుండా ఆమె (Meera Chopra) పాత్ర కూడా జనాలకు కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మీరాచోప్రాకి కూడా తెలుగులో అవకాశాలు రాలేదు. అటు తర్వాత ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో నటించినా అవి కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. చాలా తొందరగానే ఆమె ఫేడౌట్ అయిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

లాక్ డౌన్ టైంలో ఈమె ‘తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు’ ఓ చాట్ సెషన్ లో చెబితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈమెను ఘోరంగా ట్రోల్ చేశారు. ఎందుకంటే అంతకుముందు ఈమె ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్ట్ లను లైక్ చేయడం వల్ల. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఎందుకంటే ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus