పవర్ స్టార్ పవన్ చిన్నప్పటి ఫోటో చూశారా.. సేమ్ టు సేమ్ అంటూ?

మెగా హీరోలు చిరంజీవి (Chiranjeevi) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాగబాబులకు (Naga Babu) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. చిరంజీవి, పవన్ వేర్వేరుగా హీరోలుగా నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ హీరోల చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లు ఉండగా ఈ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి . అయితే మెగా బ్రదర్స్ కు సంబంధించిన రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఫోటో హాట్ టాపిక్ అవుతోంది.

ఈ ఫోటో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ఫోటో అని ఫోటోలో పవన్ లుక్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలో పవన్ ను చూసిన ఫ్యాన్స్ అప్పుడు పవన్ ఎలా ఉన్నారో ఇప్పుడు అకీరా నందన్ అలానే ఉన్నారని ఇద్దరూ సేమ్ టు సేమ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఒక ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసిన మెగా బ్రదర్స్ రేర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా పవన్ కు మెగా హీరోల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. పవన్ కళ్యాణ్ గెలుపు విషయంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ను గెలిపిస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని చిరంజీవి సైతం చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినిమా ఇండస్ట్రీ సైతం కదలడం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పవన్ పూర్తి చేస్తారు కానీ కొత్త సినిమాలను ప్రకటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus