Mega Family: అరుదైన ఘనత సాధించిన మెగా హీరోల గురించి ఆసక్తికర విషయాలు..!

2022.. ఇది ‘మెగా నామ సంవత్సరం’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు మెగాభిమానులు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది.. కేవలం సినిమాల పరంగానే కాదు.. పబ్లిక్‌గానూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి..

చిరు ఈ ఏడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ రెండు సినిమాలతో ప్రేక్షకాభిమానుల ముందుకొచ్చారు.. ‘ఆచార్య’ లో మెగా సన్ అండ్ ఫాదర్ కలిసి సందడి చేస్తే.. ‘గాడ్ ఫాదర్’ లో సరికొత్తగా కనిపించి అలరించారు మెగాస్టార్.. ఆయన ఇటీవల ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ‘ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – 2022’ పురస్కారాన్ని అందుకున్నారు.. 40 ఏళ్ల కెరీర్‌‌లో 150కిపైగా సినిమాల్లో నటించి టాలీవుడ్‌‌కి చేసిన సేవలకుగానూ ఈ గౌరవం దక్కింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

పవన్ ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ మూవీతో హంగామా చేశారు.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 161 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.. సీఏ స్టూడెంట్స్ కోసం నిర్వహించే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాంకి అతిథిగా ఆయణ్ణి ఆహ్వానించారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌..

రామ్ చరణ్‌కి రీసెంట్‌గా ‘ట్రూ లెజెండ్’ అవార్డ్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డుల ప్రదానోత్సవంలో చెర్రీ ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నాడు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ రాజ్‌గా పాన్ ఇండియా స్థాయిలో బన్నీ సందడి చేసి ఏడాది కావస్తున్నాఇంకా ఫైర్ మాత్రం తగ్గలేదు.. ప్రస్తుతం ‘పుష్ప’ రష్యాలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అక్కడ తన క్రేజ్ మామూలుగా లేదు.. ఇక ఈ ఏడాది సీఎన్ఎన్ – న్యూస్ 18 ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus