టాలీవుడ్ లో పెద్ద హీరోల పుణ్యమా అని వారి బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారసులు, వారి తాతలు, తండ్రులు, బాబాయి, మావయ్య, ఇలా వారి కుటుంభ నేపధ్యం లేకుండా నిలబడట కాస్త కష్టం. అయితే అదే క్రమంలో వారిని ఎక్కువగా అనుకరించినా ఇబ్బందులు తప్పవు ఒకోసారి. విషయం ఏమిటంటే…మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధర్మ తేజ..తీసిన 3సినిమాల్లో రెండు హిట్ అయ్యే సరికి తాను సూపర్ హీరోని అనుకున్నాడు. అంతేకాకుండా ఆ తొలి సినిమాల్లో మెగా భజన, పవన్ భజన బ్రహ్మాండంగా చేశాడు. అయితే లేటెస్ట్ గా మెగా యంగ్ హీరోలు అందరూ ఒక విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు.
తమ సినిమాల కథలు ఎలా ఉన్నా అలాగే ఆ సినిమాల్లోని కంటెంట్ ఎలా ఉన్నా కూడా మెగా ట్యాగ్ మాత్రం ఎక్కువగా వాడకుండా చూసుకుంటున్నారు. ఆల్రెడీ ఇదే విషయంలో అల్లు శిరీష్ మెగాస్టార్ మరియు పవర్ స్టార్ గురించి ఎక్కడా మాత్రం ప్రస్తావన తీసుకురాకుండా శ్రీరస్తు శుభమస్తు సినిమానటించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక అదే ఫార్ములాని ఫాలో అవ్వాలి అనుకున్నాడు మన తేజా….అయితే తాజా ‘తిక్క’ సినిమాలో అసలు మెగా రిఫరెన్స్ అనేదే లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ సినిమాలో చిరంజీవి పవన్ ల క్యారెక్టర్ ఇమిటేషన్లు కాని డైలాగ్ పంచ్ లు కాని పాటల ట్యూన్స్ వాడకం కాని లేదు. పూర్తి మెగా ఫ్రీ సినిమాగా మనం ‘తిక్క’ ను చూడొచ్చు.
ఇప్పుడు పాపం అదే మనవాడి కొంపముంచింది…ఈ సినిమా ఎంతటి డిజాస్టర్ గా మారింది అంటే…సాయిధరమ్ తేజ్ కు హ్యాట్రిక్ ను ఇవ్వదు సరి కదా ఈ హాలీడే వీకెండ్ అయ్యేవరకు అయినా కలెక్షన్స్ నిలబడతాయ అన్న డేంజర్ జోన్ లో ఉంది. ఈ లెక్కన మన వాడు మెగా, పవర్ స్టార్ భజన లేకుండా నెట్టుకు రావడం కష్టమే అన్నట్లుగా అనిపిస్తుంది…చూద్దాం మరి ఏం జరుగుతుందో.