Pushpa2 The Rule: పుష్ప 2 కోసం మెగా హీరో.. ఇకనైనా గొడవలు తగ్గేనా?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా, మెగా ఫ్యామిలీ నుంచి బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 పై ఇప్పటి వరకు మౌనం పాటించిన మెగా హీరోలు ఎట్టకేలకు స్పందించారు. మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్, పుష్ప టీమ్ కోసం బెస్ట్ విషెస్ తెలియజేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా పుష్ప 2 చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Pushpa2 The Rule

‘‘బన్నీ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు మొత్తం టీమ్‌కు బ్లాక్ బస్టర్ విజయం రావాలని కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జతగా అల్లు అర్జున్ పోస్టర్‌ను షేర్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. గత కొన్ని నెలలుగా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య సంబంధాలపై పుకార్లు షికార్లు చేశాయి.

ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని సపోర్ట్ చేయడం, మెగా ఫ్యాన్స్ అగ్రహానికి గురైంది. అప్పటి నుంచి రెండు వర్గాలు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో పుష్ప 2 గురించి మెగా హీరోలందరూ మౌనం వహించడం ప్రత్యేక చర్చకు దారితీసింది. అయితే సాయి తేజ్ ఇప్పుడు ఈ మౌనాన్ని బ్రేక్ చేయడం, రెండు వర్గాల మధ్య ఉన్న దూరం తగ్గే సంకేతాలు ఇస్తోంది.

‘‘పుష్ప 2కి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ స్పందన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి పుష్పరాజ్ హవాను మరింత మద్దతు ఇవ్వబోతున్నారని అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామాలు మెగా కాంపౌండ్‌లో మునుపటి ఆహ్లాదకర వాతావరణాన్ని తిరిగి తెస్తాయా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus