Varun, Lavanya: ఆ సంఘటనను చూపిస్తూ భయపడుతున్న మెగా ఫ్యాన్స్!

ఇటీవల మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు ట్రోలర్లకు దొరికిపోతున్నారు. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక ఏ ముహూర్తాన భర్తతో విడిపోయిందో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఏకి పారేస్తున్నారు. ఇటీవల నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 1న వీరిద్దరూ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

వీరు ఇటలీలో మూడు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ పెళ్లికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు హాజరు కావడం లేదు. కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అవుతున్నట్లు తెలుస్తుంది. కాగా మరికొద్ది రోజుల్లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా వరుణ్ తేజ్ – లావణ్యకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన సినిమా గాండీవ దారి అర్జున బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఎంతలా అంటే వరుణ్ తేజ్ (Varun) కెరియర్ లోనే పరమ చెత్త కలెక్షన్లను సాధించింది. అయితే దీనికి కారణం లావణ్య త్రిపాఠి అంటున్నారు జనాలు. లావణ్య త్రిపాఠి వరుణ్ లైఫ్ లోకి రావడం వల్లే అతడికి కలిసి రావడం లేదని.. ఆమెకు ఐరన్ లెగ్ ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లావణ్యను వరుణ్ తేజ్ దూరం పెడితేనే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓ హీరోయిన్ మెగా ఫ్యామిలీకి కోడలిగా వస్తే అస్సలు అచ్చి రాదని..

గతంలో పవన్ రేణుదేశాయ్ జంటను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా లావణ్య చేసుకుంటే అదే రిపీట్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో మెగా ఇంట పెళ్లి సందడి షురూ అయ్యేలోపే మరో కొత్త లొల్లి మొదలైందంటూ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. వరుణ్ – లావణ్య మాత్రం ఇలాంటి చెత్త కామెంట్స్ ని పట్టించుకోవడం లేదు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus