సంక్రాంతి కానుకగా 3 పెద్ద సినిమాలు వచ్చాయి.అవే రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) , వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) . రిలీజ్ కి ముందు ఈ సినిమాలకి ఉన్న హైప్ కూడా ఇదే ఆర్డర్లో ఉంది. కానీ వీటి రిలీజ్..ల తర్వాత ఆర్డర్ మారిపోయింది. ప్రేక్షకులు ఎక్కువగా ఓట్ చేసింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి..! తర్వాత బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఉంది. ఇక ఫస్ట్ అనుకున్న ‘గేమ్ ఛేంజర్’ చివరికి వెళ్ళిపోయింది.
అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి తగ్గట్టే ‘డాకు మహారాజ్’ కి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ దాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సైడ్ కి నెట్టేసినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా.. ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ రిజల్ట్ విషయంలో ఆడియన్స్ ని తప్పుబట్టనవసరం లేదు అని ఓటీటీ ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. కానీ ‘డాకు మహారాజ్’ కి దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు అని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే ‘డాకు మహారాజ్’ లో మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కి అవి నచ్చేవే. బాలయ్య ఇంట్రో సీన్ కావచ్చు, ఇంటర్వెల్ బ్లాక్ కావచ్చు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావచ్చు.. ఇలా మాస్ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. బాలయ్యని బాబీ చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేశాడు. అయినా ఈ సినిమా థియేటర్ లో సో సో గానే ఆడింది.
మెగా అభిమానులు సైతం సంక్రాంతి సినిమాల్లో ‘డాకు మహారాజ్’ బాగుంది అని పొగుడుతున్నారు. సినిమాలో ఇలాంటి మాస్ స్టఫ్ పెట్టుకుని కూడా ఎందుకు రూ.100 కోట్ల షేర్ కొట్టలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణాల లేకపోలేదు..అసలు ‘డాకు మహారాజ్’ టైటిల్ మాస్ ఆడియన్స్ కి సరిగ్గా రీచ్ అవ్వలేదు. అలాగే సరైన విధంగా ప్రమోషన్ జరగలేదు.
తమన్ పాటలు ఎక్కలేదు. ఈవెంట్లు పెట్టి హడావిడి చేసినా కంటెంట్ ఆడియన్స్ కి సరిగ్గా రీచ్ అవ్వలేదు. మరోపక్క ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరిగాయి. దాని మేనియాలో ‘డాకు..’ హడావిడి కనబడలేదు. అందుకే బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది అనడంలో సందేహం లేదు.