Ram Charan: చరణ్ విషయంలో మెగా ఫ్యాన్స్ కు టెన్షన్ ఇదే!

ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రకు బాలీవుడ్ ఆడియన్స్ నుంచి బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నా మేకర్స్ మాత్రం అలా రిలీజ్ చేయడం లేదు.

అయితే ఆచార్య సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామరాజుగా చరణ్ ను పవర్ ఫుల్ పాత్రలో చూసిన ఆడియన్స్ ఆచార్యలో సిద్ధ పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా కొరటాల శివ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా రికార్డు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది.

ఈ సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందని జరుగుతున్న ప్రచారం కూడా అభిమానుల టెన్షన్ కు ఒక విధంగా కారణమవుతోంది. చరణ్ తమ టెన్షన్ ను పోగొట్టి ఆచార్య సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా అభిమానులకు ఏప్రిల్ 29వ తేదీ స్పెషల్ డేగా మిగలనుంది.కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనుంది. కొరటాల శివ కెరీర్ లోనే ఎక్కువ సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న సినిమాగా ఆచార్య సినిమా నిలిచింది.

ఆచార్య సినిమాలో చరణ్ కొంత సమయమే కనిపించినా పవర్ ఫుల్ గా కనిపిస్తారని తెలుస్తోంది. చిరంజీవి, చరణ్, కాంబినేషన్ లో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా ఆ సినిమాలలో చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించలేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus