టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది ,ఆ స్టైల్ కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఆలోచనలు కూడా ఎంతో కొత్తగా ఉంటాయి, ఒకే మూస సినిమాలతో నిండిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని సరికొత్త పుంతలు దొక్కించిన హీరో ఆయన. ఆరోజుల్లోనే వెస్ట్రన్ కల్చర్ తరహా స్టైలింగ్ ని పరిచయం చేసి, కుర్రాళ్లను మెంటలెక్కిపోయేలా చేసాడు పవన్ కళ్యాణ్. ఆరోజు ప్రతీ పవన్ కళ్యాణ్ సినిమాకి పాటల పిక్చరైజేషన్ పవన్ కళ్యాణ్ దర్శకత్వం లోనే జరిగేవి.
ఆ పాటలు చూసేటప్పుడు ఎంతో కొత్తగా అనిపిస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ అప్పట్లో చాలా సినిమాలకు అనధికారికంగా దర్శకత్వం కూడా వహించాడు. కానీ స్క్రీన్ మీద దర్శకుడిగా పేరు పడింది మాత్రం ‘జానీ’ సినిమాకి మాత్రమే. ఆరోజుల్లో బాహుబలి 2 తరహా హైప్ తో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడం లో విఫలమై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే జానీ సినిమాకంటే ముందుగా పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడట.
ఖుషి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నాడు అంటూ అప్పట్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం సిద్ధం కూడా అయిపోయింది, కానీ క్యాస్టింగ్ విషయం లో పవన్ కళ్యాణ్ కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.వేరే ఆర్టిస్ట్స్ తో సినిమాని పూర్తి చెయ్యొచ్చు కానీ, ఆ కథకి కేవలం పవన్ కళ్యాణ్ మైండ్ లో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే సరిపోతారు.
అందుకే పవన్ కళ్యాణ్ ఆ ఆర్టిస్టుల డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో షూటింగ్ ని క్యాన్సిల్ చేసి, ‘జానీ’ స్క్రిప్ట్ మీద వర్క్ చేసాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వచ్చి ఉంటే చాలా బాగుండేది అని అనుకున్నారు.