మెగా రేంజ్ క‌థ‌ల కోసం వెయిటింగ్.. ఇంత‌కీ ఆ ల‌క్ ఎవ‌రికో..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు తండ్రి మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారం కూడా నిర్మాత అయిన‌ రామ్ చ‌ర‌ణ్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత చెర్రి న‌టించ‌బోయే చిత్రం పై ఆశ‌క్తి మొద‌లైంది. ఇప్పటికే రామ్ చ‌ర‌ణ్‌కు ప‌లువుడు ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించారు. అయితే వాటిలో ఏ ఒక్క‌టీ ఈ మెగా హీరోను మెప్పించ‌లేక‌పోయారు.

రాజ‌మౌళి చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు లాంటి ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ చేశాక, చెర్రి త‌ర్వాత చిత్రం పై మెగా అభిమానుల్లోనే కాకుండా కామ‌న్ ఆడియ‌న్స్‌లో కూడా అంచ‌నాలు హైరేంజ్‌లో ఉంటాయి. దీంతో ఎలాంటి జోన‌ర్ ఎంచుకోవాల‌నే దాని పై క్లారిటీ రాలేదు. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన క‌థ‌ల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోనే ఉన్నా మూల క‌థ‌లో వైవిధ్యం లేక‌పోవ‌డంతో చ‌ర‌ణ్ ఓ ప‌ట్టాన ఏ క‌థ‌ని ఫైన‌లైజ్ చేయ‌డం లేద‌ని స‌మ‌చారం. ఎందుకంటే గ‌తంలో జ‌క్క‌న్న‌తో మ‌గ‌ధీర త‌ర్వాత డిఫ‌రెంట్ స్టైల్‌లో ఆరెంజ్ మూవీ చేసి త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అందుకున్నాడు. దీంతో సేమ్ సిట్యువేష‌న్ మ‌రోసారి రిపీట్ కాకూడ‌ద‌ని భావిస్తున్న చెర్రి, ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అయితే రామ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రేంజ్ క‌థ‌లు ప్ర‌స్తుతం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే ద‌ర్శ‌కుడు రీచ్ కాలేద‌ని టాక్. పాన్ ఇండియా టార్గెట్‌గా తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ త‌ర్వాత, అదే రేంజ్‌లో క‌థ‌తోనే సినిమా చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ద‌గ్గ‌ర‌కు లోక‌ల్ క‌మ‌ర్షియల్ స్క్రిప్ట్‌లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ట‌. దీంతో వాటిని మొహ‌మాటం లేకుండా తిర‌స్క‌రిస్తూ.. పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో వ‌చ్చే ద‌ర్శ‌కుల‌కు సినిమా ఓకే చేస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. దీంతో ప్ర‌స్తుతం కొంద‌రు రైట‌ర్స్ అండ్ డైరెక్ట‌ర్స్ ఈ మెగా హీరో కోసం పాన్ ఇండియా క‌థ‌ను చెక్కే ప‌నిలో ఉన్నార‌ని, చ‌ర‌ణ్‌తో నెక్స్ట్ మూవీ చేసే ల‌క్ ఎవ‌రికి ద‌క్కుతుందో అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ‌

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus