మెగా హీరోలు(Mega Heros) కొన్నేళ్ళ నుండి ఫామ్లో లేరు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో ‘ఆచార్య’ ఫలితాన్ని మరిపించారు అనుకునేలోపే ‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ ఇచ్చి షాకిచ్చారు. ‘విశ్వంభర’ అయితే రిలీజ్ కి నోచుకోలేదు. అయితే 2026 సంక్రాంతికి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరు. అనిల్ రావిపూడి దర్శకుడు కాబట్టి.. ఇది మినిమమ్ గ్యారెంటీ అని అంతా భావిస్తున్నారు. బయ్యర్స్ కూడా భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు.
వెంకీ కేమియో కూడా ఉంది కాబట్టి.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్ తో ఇది కూడా సక్సెస్ అందుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు తర్వాత అంటే సమ్మర్ ప్రారంభంలో ‘పెద్ది’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రామ్ చరణ్. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘పెద్ది’ తో గాయాన్ని మరిపించాలని చరణ్ భావిస్తున్నాడు.

‘చికిరి చికిరి’ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యింది కాబట్టి హైప్ పెరిగింది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చరణ్ కి హిట్టు కన్ఫర్మ్ అనే చెప్పాలి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘హరిహర వీరమల్లు’ అందరూ ఊహించినట్టే పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘ఓజి’ అభిమానులను అయితే అలరించింది.
కానీ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం… అది హిట్టు కాదు. అబౌవ్ యావరేజ్ సినిమా అనే లైన్ దగ్గరే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పవన్ కళ్యాణ్. ‘గబ్బర్ సింగ్’ కాంబో కాబట్టి.. సినిమాపై హైప్ ఉంది. ఫస్ట్ సింగిల్ కూడా చార్ట్ బస్టర్ అయ్యింది కావడంతో అది ఇంకా పెరిగింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించే పెద్ద సినిమాలు ఫెయిల్ అయ్యింది లేదు.
సో ఈ ఏడాది పవన్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ముగ్గురు మెగా హీరోలు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
