‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా..ఈడా ఉంటా..’ ఇది ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ పలికిన డైలాగ్. అయితే ఇది నిజజీవితంలో నిర్మాత నాగవంశీకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈయన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందే సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. మరోపక్క తన బాబాయ్ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించే సినిమాలకి సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు.
పైగా ప్రమోషన్స్ లో కూడా ఆయనే ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లో దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) సినిమాలు మాత్రమే రూపొందుతుంటాయి అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అదే బ్యానర్లో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47′(ఏకే 47) అనే సినిమా కూడా రూపొందుతోంది.అయితే ఈ సినిమాకి మొదట ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరిగింది.

ఆల్మోస్ట్ అదే టైటిల్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47′(ఏకే 47) టైటిల్ అనౌన్స్ చేసి షాకిచ్చారు. మరి ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ఎందుకు ప్రచారమైనట్టు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఆ టైటిల్ ను కూడా నాగవంశీనే రిజిస్టర్ చేశారట. కాకపోతే అది తన బ్యానర్లో చేయబోయే చిన్న సినిమాకి.
అవును ‘మ్యాడ్’ హీరో రామ్ నితిన్ తో నాగవంశీ ఓ సినిమా రూపొందిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సాగే పెళ్లి కథ ఇది. దాని కోసమే ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ను ఆయన రిజిస్టర్ చేశారు. కాకపోతే అది త్రివిక్రమ్ – వెంకటేష్..ల సినిమా కోసం అనుకుని ఇండస్ట్రీ వర్గాలు ప్రచారం చేసేశాయి. ఆ ప్రచారం వల్ల టైటిల్ కూడా మార్మోగింది కాబట్టి.. నాగవంశీకి అదొక అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
