Ram Charan: అక్కడికి వెళ్లాక రామ్ చరణ్ లుక్ మారడం గురించి క్లారిటీ ఇచ్చేశారు..!

‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా సత్తా ఏంటనేది మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి.. ఏకంగా లెజెండరీ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం తన మేకింగి స్టైల్‌కి మంత్రముగ్దులయ్యేలా చేశారు.. గోల్డోన్ గ్లోబ్‌తో సహా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ట్రిపులార్ టీమ్‌ని వరించాయి.. ఇక ‘నాటు నాటు’ సాంగ్ క్రియేట్ చేసిన, చేస్తున్న సెన్సేషన్ అయితే అంతా ఇంతా కాదు..యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు..

ఇటీవల చరణ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.. స్వామి మాలలో ఎయిర్ పోర్ట్‌లో చెర్రీ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.. న్యూయార్క్‌లో వరల్డ్ పాపులర్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పార్టిసిపెట్ చేశారు.. ఈ షోలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ చరణే కావడం విశేషం.. అక్కడ రామరాజుని చూడ్డానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు, ఫ్యాన్స్ వచ్చారు.. అయితే మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్ మాత్రం కిరాక్ ఉందంటూ నెట్టింట పిక్స్ వైరల్ అవుతున్నాయి..

ఆ ఫోటోలు చూసిన కొందరికి.. ‘‘రామ్ చరణ్ ఇక్కడి నుండి అయ్యప్ప స్వామి మాలలో వెళ్లారు కదా.. అక్కడికి వెళ్లాక మాల తీసేశారేంటి?’’ అనే డౌట్ వచ్చింది.. దీనికి మెగా పీఆర్ టీమ్ నుండి క్లారిటీ వచ్చింది.. చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు.. 21 రోజుల మాల వేసుకున్నారాయన.. అది నిన్నటితో పూర్తి కావడంతో.. అక్కడి దేవాలయంలో మాల తీశారు..

తర్వాత నార్మల్ డ్రెస్సింగ్‌కి వచ్చేశారు కానీ మాలలో ఉండి ఇలా డ్రెస్ చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.. చెర్రీ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.. ఇటీవలే శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న RC 15కి సంబంధించి ఓ సాంగ్ కంప్లీట్ చేశారు చరణ్.. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus