డైరెక్టర్ గా మారబోతున్న మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి… 65 ఏళ్ల వయసులో కూడా స్టార్ గా కొనసాగుతున్నారు. ఒక్క రజినీ కాంత్ ను పక్కన పెడితే ఇండియా వైడ్ ఏ హీరోకి సాధ్యం కాని ఫీట్ అది. మెగాస్టార్ సక్సెస్ వెనుక ఆయన హార్డ్ వర్క్ మాత్రమే కాదు… ఆయన జడ్జ్ మెంట్ కూడా కీలక పాత్ర పోషించింది అని ఇండస్ట్రీ లో చాలా మంది చెబుతుంటారు. ఆయనకు డైరెక్షన్ పై కూడా పట్టు ఉంది. ‘ఘరానా మొగుడు’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాలకు కొంత పార్ట్ చిరునే డైరెక్ట్ చేసారు. సెట్స్ లో అన్ని ఏరియాల్లోనూ చిరుకి అనుభవం ఉంది. అందుకే చిరు ఓ చిత్రానికి డైరెక్టర్ గా చేస్తారు అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

ఆయన మేనల్లుడు సాయి తేజ్ ను హీరోగా పెట్టి … ఆయన సొంత బ్యానర్ అయిన ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై ఓ చిత్రాన్ని చిరు డైరెక్ట్ చేయబోతున్నారు అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన సొంత బ్యానర్ పై సినిమా నిర్మించే అవకాశం ఉంది కానీ డైరెక్షన్ వైపుకి చిరు వెళ్ళకూడదు అని చిరు భావిస్తున్నారట. “డైరెక్షన్ అనేది చాలా పెద్ద బాధ్య‌త‌.

ఎంతో కన్విక్షన్ తో కూడుకున్నది. హీరోగా చేస్తూ డైరెక్షన్ అనే పెద్ద బ‌రువుని మొయ్యడం అనేది తేలిక కాదు. టాలీవుడ్లో చాలా గొప్ప డైరెక్టర్ లు ఉన్నారు. వాళ్ల‌ని నమ్మి…బాధ్య‌త వాళ్ల‌పై పెడితే స‌రిపోతుంది. డైరెక్షన్ అనేది నా గోల్ ఎప్ప‌టికీ కాదు” అంటూ చిరు క్లారిటీ ఇచ్చారు.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus