దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను ఎంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారో తెలిసిందే. మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ ని రంగంలోకి దింపారు. ఇప్పుడు చరణ్ కి జోడీగా పూజాహెగ్డేను తీసుకొచ్చారు. దీంతో సినిమా మార్కెట్ వ్యవహారాలు వందల కోట్లు దాటేస్తుంది. కొరటాల శివ కేవలం దర్శకత్వం వరకు చూసుకొని సినిమాని విడిచిపెట్టరు. మార్కెటింగ్ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. సినిమా మార్కెట్ మొత్తం చూసుకుంటే రూ.200 కోట్లు దాటేస్తున్నట్లు సమాచారం.
వైజాగ్, కృష్ణ, గుంటూరు ఏరియాల హక్కులను కొరటాల తన స్నేహితుడు సుధాకర్ దగ్గర ఉంచాడు. ఈస్ట్ ను భర్త చౌదరికి ఇచ్చారు. కొరటాల సినిమాలన్నీ కూడా ఈస్ట్ ఏరియాలోని ఈయనే పంపిణీ చేస్తుంటారు. ఇలా వెస్ట్ ఆదిత్య రెడ్డి, సీడెడ్ అభిషేక్ రెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క ఆంధ్రనే రూ.60 కోట్ల రేషియాలో కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నైజాం రేటు ఇంకా తేలలేదు. ఈ విషయంలో దిల్ రాజుతో మీటింగ్ పెట్టుకొని ఓ నిర్ణయానికి వస్తారు. ఆయనతో లెక్కలు తేలకపోతే.. వరంగల్ శ్రీను లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఆయన మేకర్లు అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 40 నుండి 45 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నాడట వరంగల్ శ్రీను. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు కూడా కలుపుకుంటే సినిమా బిజినెస్ రూ.200 కోట్లు దాటేసేలా ఉంది. అయితే సినిమా కోసం ఖర్చు పెట్టిన మొత్తమేమీ కూడా తక్కువ కాదు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్ కలుపుకుంటే వంద కోట్లు దాటడం ఖాయం. అదే రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది.