Chiranjeevi: ‘మేజర్’ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించారని తెలుసా!..

  • February 24, 2023 / 01:55 PM IST

మెగాస్టార్ చిరంజీవి తెలుగు తెరపై అగ్రహీరోగా ఎదుగుతున్న క్రమంలో ఆయన క్రేజ్ సౌత్ అంతా పాకిపోయింది.. ఒకానొక టైంలో అప్పటి నార్త్ బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను కూడా స్టార్ డమ్, రెమ్యునరేషన్ వంటి విషయాల్లో దాటేశారు చిరు.. ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ నేషనల్ మీడియా చిరు గురించి కథనాలు ప్రచురించిందంటేనే సుప్రీం హీరో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.. తర్వాత ఇతర భాషల్లో..

మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో నటించాలనే విజ్ఞప్తులు పెరిగిపోవడంతో 1990లో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరు.. తెలుగు ‘అంకుశం’ రీమేక్‌గా తెరకెక్కిన ‘ప్రతిబంద్’ తో సాలిడ్ సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ రీమేక్ ‘ఆజ్ కా గూండా రాజ్’, అర్జున్ ‘జెంటిల్ మెన్’ రీమేక్ ‘ది జెంటిల్ మెన్’ లాంటి హిట్స్ కొట్టారు.. తెలుగులో బీభత్సమైన బిజీ అయిపోవడం వల్ల మళ్లీ హిందీలో నటించే వీలు పడలేదు.. 1990 నుంచి 1994 మధ్య హిందీలో నటించారాయన..

ఇదిలా ఉంటే ఆ తర్వాత 1996లో కన్నడ స్టార్ రవి చంద్రన్ రిక్వెస్ట్ చేయడంతో ప్రత్యేక పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు చిరంజీవి.. ఆ సినిమాకి దర్శక నిర్మాత రవి చంద్రనే.. సౌందర్య కథానాయిక.. హంసలేఖ సంగీత దర్శకుడు.. సినిమా పేరు ‘సిపాయి’.. చిరు, మేజర్ చంద్రకాంత్ అనే సోల్జర్ క్యారెక్టర్ చేశారు.. కథలో ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కావడంతో ఆయన చేశారు.. చిరుకి పాటలు, ఫైట్స్ కూడా ఉంటాయి.. కాకపోతే కథ ప్రకారం క్లైమాక్స్‌లో మేజర్ చంద్రకాంత్ పాత్ర చనిపోతుంది..

చిరు 1996లో ‘సిపాయి’ అనే కన్నడ మూవీ చేశారని చాలా మందికి తెలీదు.. తర్వాత ఈ చిత్రాన్ని ‘మేజర్’ పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.. ప్రత్యేక పాత్రలో ‘‘మెగాస్టార్’’ అంటూ పబ్లిసిటీ చేశారు.. పెద్దగా ఆడినట్టు లేదు.. యూట్యూబ్‌లో కన్నడ వెర్షన్ ఉంది కానీ తెలుగు డబ్డ్ వెర్షన్ లేదు.. చిరు కనిపించిన సాంగ్ మాత్రం అందుబాటులో ఉంది..


సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus