Chiranjeevi: చిరు ప్రయోగం చేస్తున్నారా.. వర్కౌట్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)  ‘భోళా శంకర్’ (Bhola Shankar) తో పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. దాని ఫలితాన్ని మరిపించాలని ‘విశ్వంభర’  (Vishwambhara) చేస్తున్నారు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకుడు. మరోపక్క యంగ్ డైరెక్టర్స్ కి కూడా ఆయన ఛాన్సులు ఇచ్చుకుంటూ పోతున్నారు. దీంతో చిరు ప్రయోగాలు చేస్తున్నారేమో అనే డౌట్లు అభిమానుల్లో కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’ (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela)  ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే అధికారిక ప్రకటన వచ్చింది.

Chiranjeevi

ఈ సినిమాకి నాని (Nani)   ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెయిన్ నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కూడా ‘దసరా’ స్టైల్లోనే చాలా రా..గా రక్తపాతంతో నిండి ఉంటుందట. పోస్టర్ తోనే ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఉండదట. ఉన్నా 10,15 నిమిషాల నిడివి వరకే అని సమాచారం. ఆ కాసేపు కూడా హీరో, హీరోయిన్ల మధ్య పాటలు, చిరు స్టెప్పులు వంటివి ఉండవట.

చిరు ఫ్యాన్స్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్.. కోరుకునేవే అవి. మరి అవి లేకుండా సినిమా అంటే ఫలితం ఎలా వస్తుందో. వాస్తవానికి ‘గాడ్ ఫాదర్’ (Godfather) లో కూడా చిరుకి జోడీగా హీరోయిన్ ఉండదు. మెయిన్ ప్లాట్ దెబ్బతింటుందేమో అని ఆ ఆలోచనని చిరు, దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) విరమించుకున్నారు. కానీ చిరు మార్క్ ఎలివేషన్స్ అందులో మిస్ అవ్వవు. పైగా సల్మాన్ ఖాన్ (Salman Khan) ఎంట్రీతో చిరుకి మరింత ఎలివేషన్స్ దక్కినట్టు అయ్యింది.

చై….నాకోసం అక్కడి వరకు వచ్చేవాడు: శోభిత!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus