Sobhita Dhulipala: చై….నాకోసం అక్కడి వరకు వచ్చేవాడు: శోభిత!

హీరోయిన్ సమంత (Samantha) నుంచి విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య (Naga Chaitanya)   .. త్వరగానే మరో నటిని చూసుకొని ముచ్చటగా మరోమారు పెళ్లి చేసుకొని సెటిలైపోయాడు. ఇది దాదాపు ఎవ్వరూ ఎవ్వరూ ఊహించనిది. సామ్ నుంచి విడిపోయాక దాదాపు ఏడాది పాటు గ్యాప్ లోనే ముంబాయిలో స్థిరపడ్డ తెలుగు నటి శోభితతో (Sobhita Dhulipala) కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట చైతూ – శోభిత ప్రేమాయణం గురించి వార్తలు వచ్చినపుడు జనం అవి జస్ట్ రూమర్లని అనుకున్నారు కానీ, తర్వాత వీరి ప్రేమ నిజం కావడం, తరువాత పెళ్లి పీటలు ఎక్కడం చాలా స్పీడుగా జరిగిపోయాయి.

Sobhita Dhulipala

ఇప్పుడు ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య అసలు ప్రేమ ఎలా మొదలైంది.. పెళ్లి వరకు ఎలా వచ్చారు అనే విషయాలు చాలామంది ఆన్లైన్లో వెతికేస్తున్నారు. ఈ తరుణంలోనే శోభిత వారి ఇరువురి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ… చైతూతో పరిచయం, ప్రేమ గురించి స్వయంగా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ… “2022 ఏప్రిల్‌ నుంచే నేను చైతూను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నా.

ఆ తర్వాత చైతూ కూడా నన్ను ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో నేను పోస్ట్ చేసే స్ఫూర్తివంతమైన(ఇన్స్పిరేషనల్) స్టోరీస్, నా ఒపీనియన్స్ కి సంబంధించిన పోస్ట్‌లకి నాగచైతన్య ఎప్పటికప్పుడు లైక్‌ చేసే వాడు. నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్‌ గురించే మాట్లాడుకొనేవాళ్ళం. తెలుగులో మాట్లాడమని చైతూ నన్ను ఎప్పుడూ అడిగేవాడు. అలా మాట్లాడుతున్నపుడే మా ఇద్దరి మధ్య బంధం బలపడింది.” అని చెప్పుకొచ్చింది శోభిత.

అంతేకాదు శోభిత మాట్లాడుతూ…’మొదటిసారి మేము ముంబయిలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నాము. అప్పుడు చైతన్య హైదరాబాద్‌లో, ఆమె ముంబయిలో ఉండేదట. ఆ సమయంలో చైతన్య శోభిత కోసం హైదరాబాద్‌ నుంచి ముంబై వచ్చేవాడు. మొదటిసారి మేము అలా బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్‌ డ్రెస్‌, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడని’ కూడా చెప్పుకొచ్చింది.

హను రాఘవపూడితో సినిమా అంటే ఇంతేమరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus