Chiranjeevi: సీనియర్ యాక్టర్ సుమన్‌కి చిరంజీవి విషెస్ ఎందుకంటే.. వీడియో వైరల్..

సుమన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు.. తుళు మాట్లాడే కుటుంబానికి చెందిన సుమన్.. మద్రాసులో పుట్టి.. తమిళ సినిమాలతోనే కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగు, తమిళ నాట స్టార్ స్టేటస్‌తో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించారు.. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సుమన్.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్.. ఇలా ప్రతి పాత్రలోనూ ప్రత్యేకత చూపించారు..

సెకండ్ ఇన్నింగ్స్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేశారు.. ఈ ఏడాదితో ఆయన నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. సుమన్‌కి విషెస్ తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.. నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మై డియర్ బ్రదర్ సుమన్‌కి నా శుభాకాంక్షలు.. పది భాషల్లో 700 లకు పైగా సినిమాలు చేయడం అద్బుతం.. బెంగుళూరులో ఫిబ్రవరి 16న జరుగబోతున్న 45 ఇయర్స్ ఈవెంట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానంటూ చిరు చెప్పుకొచ్చారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus