Chiranjeevi, Rajinikanth: రజనీకాంత్ నడకను ఇమిటేట్ చేసిన చిరు.. వీడియో వైరల్?

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్ గా ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నేటి తరం హీరోలకు ధీటుగా సినిమాలలో నటిస్తూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ కార్యక్రమ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులను ప్రేక్షకులను సందడి చేసినట్టు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా విజేత వాగ్దేవికి ట్రోఫీ అందించడమే కాకుండా ఈ వేదికపై తన చిలిపి చేష్టలతో అందరినీ నవ్వించారు. ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఆయనను ఇమిటేట్ చేశారు. ఈ వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తావన రావడంతో ఆయన గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడటమే కాకుండా ఆయన ఎలా నడుస్తారో చేసి చూపించారు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా నడుస్తారు అనేది ఇమిటేట్ చేసి చూపించడంతో ఒక్కసారిగా వేదిక మొత్తం ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఓ కంటెస్టెంట్ రజనీకాంత్ కు పెద్ద అభిమాని కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన కళ్ళజోడును అతనికి బహుమానంగా ఇచ్చారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి కళ్ళజోడును అందుకున్న అభిమాని రజనీకాంత్ స్టైల్ గా ఎలా పెట్టుకుంటారో తను కూడా అదేవిధంగా కళ్ళజోడు పెట్టుకోవాలని సూచించారు.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి రెట్టింపు ఉత్సాహంతో ఈ వేదికపై ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus