Chiranjeevi: సంక్రాంతి హీరోలతో మెగాస్టార్.. నిజమేనా?

ఈ సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ భారీ పోటీలకు వేదిక కానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలకానున్న మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. జనవరి 10న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్,’ జనవరి 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్,’ జనవరి 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

Chiranjeevi

ఈ మూడు సినిమాల కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ చిత్రాలు, వివిధ జోనర్లను అందిపుచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డుల కోసం బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల ప్రోమోషన్లు షురూ కాగా, ట్రైలర్లు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

‘గేమ్ చేంజర్’ రాజకీయ అంశాలతోపాటు మాస్ ఎలిమెంట్స్ కలిపిన కథతో వస్తున్నట్లు టాక్. ‘డాకు మహారాజ్’ పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగలా రూపొందించిన హిలేరియస్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ ముగ్గురు హీరోలతో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇదే నిజమైతే, ఇది అభిమానులకు పెద్ద పండుగ అనే చెప్పాలి. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేశ్‌లతో సరదాగా కబుర్లు చెప్పడం అభిమానులలో ఉత్సాహం నింపుతుందని చెప్పొచ్చు. చిరంజీవి గతంలో ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా అభిమానులను ఆనందపరిచినప్పటికీ, ఈసారి సంక్రాంతి నేపథ్యంలో మూడూ ప్రధాన చిత్రాలపై చర్చ జరగడం విశేషం. మరి ఈ క్రేజీ ఇంటర్వ్యూ నిజమవుతుందా? లేదా అనేది చూడాలి.

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు ఇక ఉండవా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus