బుచ్చి బాబుకి – దేవిశ్రీకి లెటర్స్ పంపిన మెగాస్టార్

బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన మ్యూజికల్ లవ్ స్టోరీ ఉప్పెన. ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ వచ్చి కలక్షన్స్ త్సునామీని క్రియేట్ చేసింది. ఇక ఉప్పెన సినిమాకి మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో పాటలు వింటూ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు ఉప్పెన టీమ్ ని అబినందిస్తూ దేవిశ్రీ ప్రసాద్ కి, అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకి మెగాస్టార్ స్వయంగా లెటర్స్ రాసి అభినందించారు.

మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్ర‌సాద్‌కి ఒక మ్యూజిక‌ల్ గిఫ్ట్‌తో పాటు లెటర్ ని కూడా పంపారు. ‘ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాష‌న్ తో సంగీతాన్నిస్తావో, చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ప్యాష‌న్‌తో మ్యూజిక్ నిస్తావ్‌. నీలో వుండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.. ప్రేమతో చిరంజీవి’ అంటూ లెటర్లో రాశారు.

అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకి కూడా ఒక లెటర్ , గిఫ్ట్ పంపారు. తొలిచిత్రంతోనే తెలుగు పరిశ్రమపైన, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశావు. కథగా ఏది వినిపించావో, అంతకు మించి తెరమీద కనిపించావ్. నీకు నా ప్రేమాభినందనలు. భవిష్యత్ లో ఎప్పటికీ ఈ గురువుకి గర్వకారణమైన శిష్యుడిలా ఉంటావని, మరెన్నో మరపురాని చిత్రాలని అందిస్తావని , అలరిస్తావని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను.. మీ చిరంజీవి అంటూ బుచ్చిబాబుకి కూడా ఒక ఎప్రిషియేషన్ లెటర్ ని పంపారు మెగాస్టార్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus