‘ఉప్పెన’ సినిమా డైరెక్టర్ కి చిరంజీవి కితాబు!

మెగా కాంపౌండ్ నుండి మరో హీరో వెండితెరకి పరిచయం కాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా ద్వారా హీరోగా పరిచయవుతున్న విషయం తెలిసిందే. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా ల్యాబ్ లోనే ఉండిపోయింది. సినిమా మీద నమ్మకంతో ఓటీటీకి ఇవ్వకుండా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూశారు నిర్మాతలు. ఎట్టకేలకు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 12న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తన మేనల్లుడి డెబ్యూ సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది. ఆయనకి సినిమా బాగా నచ్చిందట. దర్శకుడు బుచ్చిబాబు చాలా బాగా తీశారని..

అచ్చం భారతీరాజా సినిమా మాదిరి ఉందని మెగాస్టార్ కితాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతీరాజా స్టైల్ లో సినిమా ఉందని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అనడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరగడం ఖాయం. మరి సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus