Meher Ramesh: శక్తి రిజల్ట్ పై మెహర్ రమేష్ స్పందన ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని డిజాస్టర్లలో శక్తి సినిమా కూడా ఒకటి. అశ్వనీదత్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే మెహర్ రమేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో శక్తి మూవీ రిజల్ట్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

శక్తి సినిమా అశ్వనీదత్ గారికి బడ్జెట్ విషయంలో ఎంతగానో వర్కౌట్ అయిన సినిమా అని వేర్వేరు దేశాలలో ఆ సినిమా షూటింగ్ జరిగిందని మెహర్ రమేష్ కామెంట్లు చేశారు. 30 రోజుల పాటు లైట్స్, జనరేటర్ లేకుండా శక్తి మూవీ షూటింగ్ చేశానని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. నేను బెస్ట్ డిజైనర్ అని మెహర్ రమేష్ వెల్లడించారు. శక్తి సినిమా అసలు కథ అది కాదని మెహర్ రమేష్ పేర్కొన్నారు.

సినిమాలో సెకండాఫ్ లో లవ్ స్టోరీ ఉండేలా ప్లాన్ చేశామని అశ్వనీదత్ గారు సినిమాలో డివైన్ ఎలిమెంట్ ఉంటే బాగుంటుందని గంధం నాగరాజు, యండమూరి వీరేంద్రనాథ్, కొంతమంది పండితులను నాకు ఇచ్చారని మెహర్ రమేష్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత చేసిన మార్పుల వల్ల శక్తి సినిమా కథ నాకే అర్థం కావడం లేదని నేను చెప్పానని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. ఏ సినిమా అయినా ఫ్లాప్ కావాలని ఎవరూ తీయరని ఆయన వెల్లడించారు.

మేకింగ్ విషయంలో నేను చూసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమాను నేను బెస్ట్ గానే తీశానని అయితే సినిమా వర్కౌట్ కాలేదని ఆయన పేర్కొన్నారు. ట్రోల్స్, మీమ్స్ ను చూస్తానని మెహర్ రమేష్ వెల్లడించారు. శక్తి సినిమా గురించి స్పందించడానికి తారక్ కూడా ఇష్టపడరు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ విషయంలో కూడా నెటిజన్ల నుంచి ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus