Mehreen Pirzada : బ్రేకప్ తరువాత హీరోయిన్ రచ్చ!
- July 10, 2021 / 12:02 PM ISTByFilmy Focus
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది హీరోయిన్ మెహ్రీన్. భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరగడంతో ఇక పెళ్లి ఒక్కటే ఆలస్యం అనుకున్నారంతా.. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చింది. నిశ్చితార్దాన్ని రద్దు చేసుకుంటున్నామని.. పెళ్లి ఉండదని ప్రకటించింది. దీనిపై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే మెహ్రీన్ మాత్రం వేటినీ పట్టించుకోలేదు. పెళ్లి క్యాన్సిల్ కావడంతో సినిమాలతో బిజీ అయిపోయింది. తన సినీ కెరీర్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే మెహ్రీన్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
మెహ్రీన్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. మెహ్రీన్ ఇప్పుడు అందాల ఆరబోతలోనూ దుమ్ములేపుతోంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. తన హాట్ నెస్ తో ఆకట్టుకోవడంతో పాటు ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చింది. ”అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది.

ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది” కాస్త గందరగోళంగా ఉన్న కొటేషన్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా తాను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని.. రక్షణ కోసం ఇతరులపై ఆధారపడనని పరోక్షంగా చెబుతోంది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!











