‘రైటర్ పద్మభూషణ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘లహరి ఫిల్మ్స్’, ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ సంస్థల నుండి వచ్చిన క్రేజీ మూవీ ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్ రెడ్డి(మేజర్ ఫేమ్), శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.
మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ అయితే యావరేజ్ గా వచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ యూత్ ను, సోషల్ మీడియా బ్యాచ్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అని చెప్పారు. దీంతో మొదటి వీకెండ్ ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.86 cr
సీడెడ్
0.22 cr
ఆంధ్ర
0.32 cr
ఏపీ+ తెలంగాణ టోటల్
1.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.26 cr
వరల్డ్ వైడ్ టోటల్
1.66 cr
‘మేమ్ ఫేమస్’ (Mem Famous) చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.14 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.