మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీయడంలో నేర్పరి అయిన శంకర్ వద్ద శిష్యరికం చేసిన అట్లీ గురువు బాటలోనే నడుస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ప్రజల బాధలను సినిమాలో మిక్స్ చేస్తున్నారు. అతని దర్శకత్వంలో తెరకెక్కిన “మెర్సల్” కేంద్రాన్ని కదిలిస్తోంది. మోదీ ప్రభుత్వం పనితీరుని ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరుగుతోందో… ప్రభుత్వాసుపత్రుల పనితీరు పైనా వేసిన డైలాగును విజిల్స్ వేయిస్తున్నాయి. నేతలలో గుబులు పుట్టిస్తున్న డైలాగ్స్ ఏమిటంటే?
డబ్బులు చెల్లించలేని పరిస్థితి
“ఇండియాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనీసం ఆక్సిజన్ సిలెండర్స్ కూడా ఉండవు.. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సిలండర్లు లేకపోవడానికి కారణం? ఆక్సిజన్ సప్లయర్లకు రెండేళ్లుగా డబ్బులు చెల్లించలేని పరిస్థితిని ఎందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఎదుర్కొంటున్నాయి?”
జీఎస్టీ సరే.. ఉచిత వైద్యం ఎక్కడ?
సింగపూర్ ప్రజలు 7శాతం జీఎస్టీ కడుతున్నారు.. ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు.. కాని భారత ప్రభుత్వం ప్రజలనుంచి 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. అయినా ఎందుకని ప్రజలందరికీ కనీసం ఉచిత వైద్యం అందించలేకపోతోంది?
లిక్కర్ పై జీఎస్టీ ఏది?
మెడిసిన్ మీద 12శాతం జీఎస్టీ కడుతున్నాం..లిక్కర్ మీద మాత్రం జీఎస్టీ లేనేలేదు.. ఎందుకిలా?
ఎంతటి దౌర్భాగ్యం!
ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నప్పుడు పవర్ ఔటేజ్ సమస్య తలెత్తి నలుగురు రోగులు చనిపోయారు.. పవర్ సప్లై బ్యాకప్ లేక వీళ్లంతా చనిపోవడం ఎంతటి దౌర్భాగ్యం?
హత్యలేనా?
ఇంక్యుబేటర్ లో ఉంచిన బేబీ ఎలుకలు కొరికి చనిపోవడమా?.. ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుబడి సార్.. ..ఈ హత్యలన్నిటినీ మనం న్యాయమే అందామా? వీటిని హత్యలు అనకూడదా?