కలెక్షన్ కింగ్ మోహన్ బాబు…ఎన్టీఆర్ తరువాత అంత స్పష్టంగా డైలాగ్ చెప్పాలి అంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వల్లనే అవుతుంది అనే మ్యాటర్ ఒకటి ఉంది…కొందరు ఒప్పుకున్నా…మరి కొందరు ఒప్పుకోకున్నా…మోహన్ బాబు, డైలాగ్స్ విషయంలో కింగ్ అని చెప్పక తప్పదు. అయితే అదే క్రమంలో తెలుగు చలన చిత్ర సీమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు, పాత్రలు పోషించడమే కాకుండా, అదే క్రమంలో నిర్మాతగానూ అనేక సినిమాలు తెరపై చిత్రీకరించిన విలక్షణ నటులు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే అలాంటి మోహన్ బాబుకి ఇప్పుడు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఒక పక్క ఇండస్ట్రీలో ఒక నటుడిగానే కాకుండా, నిర్మాతగానే కాకుండా మరో పక్క రాజకీయ, విద్యావేత్త, వ్యాపార రంగాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న మోహన్ బాబు ఇప్పటికీ నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నే కాకుండా ఇప్పటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్ లతో కూడా నటించి మెప్పించిన మోహన్ బాబుకి చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది అని వార్తలు వస్తున్నాయి…అయితే ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. మనోజ్ తన ట్విట్టర్ లో ‘కంగ్రాట్స్ నాన్నా..ఎంతో గర్వపడే క్షణం’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఫొటోను పోస్ట్ చేశాడు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ నెల 4వ తేదీన ఈ డాక్టరేట్ ను తన తండ్రి అందుకోనున్నట్టు మంచు మనోజ్ తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. మొత్తంగా చూసుకుంటే మన తెలుగు నటుడికి ఈ అరుదైన గౌరవం లభించడం గర్వకారణం అనే చెప్పాలి.