విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ మొదటి చిత్రం ‘దొరసాని’ తో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. మంచి ఎమోషనల్ డ్రామాను అయితే ఎంచుకున్నాడు కానీ.. నటన పరంగా ఇంకా పరిణితి చెందాల్సి ఉందని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే స్టోరీ సెలక్షన్ విషయంలో అతనికి మంచి టేస్ట్ ఉందని ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సైలెంట్ గా తన రెండో సినిమాని కూడా పూర్తిచేసేసాడు ఆనంద్ దేవరకొండ.
‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినోద్ అనంతోజ్ డైరెక్ట్ చేసాడు. ‘బిగిల్’ ‘జాను’, ‘చూసి చూడంగానే’ వంటి చిత్రాల్లో నటించిన వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అమెజాన్‌లో ప్రైమ్లో ఈ చిత్రం నవంబర్ 20న విడుదల కాబోతుంది. రూ.4 కోట్లు పెట్టి ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేశారట అమెజాన్ వారు. అంతేకాదు ఈ చిత్రం చాలా బాగా వచ్చింది అని ఇన్సైడ్ టాక్. ఓటిటికి కరెక్ట్ సినిమా అని కూడా కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాన్ని రూ.1.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారట నిర్మాతలు.సో ఇక్కడికి నిర్మాతలు సేఫ్ అయిపోయినట్టే..! సినిమాకి మంచి టాక్ వస్తే అమెజాన్ ప్రైమ్ వారు కూడా సేఫ్ అయిపోతారు. వ్యూయర్ షిప్ ను బేస్ చేసుకుని నిర్మాతకు మరింత రాబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి అలా జరిగితే.. రెండో సినిమాతో ఆనంద్ దేవరకొండ హిట్టు కొట్టినట్టే..!