డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొంత కాలంగా పూరీ మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాల పై తనకు మాత్రమే సాధ్యమైన మైండ్‌బ్లాక్ విశ్లేషణలు చేస్తూ ఆకట్టకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బ్రిటీష్ అనే పాయింట్‌ను తీసుకుని చేసిన అద్భుతమైన విశ్లేషణకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సెన్షేషన్ డైరెక్టర్ ఏమంటున్నారంటే.. మంచి అనేది శత్రువుల దగ్గర ఉన్నా దాన్ని మనం గ్రహించాలని చెబుతున్నారు పూరి.
మన భారతీయులు అందరికీ శత్రువులు అయిన బ్రిటీషర్ల నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పూరీ తన స్టైల్‌లో అభిప్రాయపడ్డారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. అతి తక్కువ ఉన్న బ్రిటీషర్లు ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలను తప్పించి, మిగిలిన దేశాలన్నిటిని పాలించి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలో అందరికీ షర్టు, ప్యాంటు వేయడం నేర్పించారు.. అలాగే అందరికీ ఇంగ్లీష్ భాషను కూడా నేర్పించారు.
బ్రిటిషర్ల ప్రత్యేకత ఏంటంటే.. వారు ఆక్రమించిన దేశాలన్నింటినీ వారి సొంత దేశాల్లా భావించి ఒక విజన్‌తో అభివృద్ధి చేయడం. వ్యవస్థలను అర్ధం చేసుకోవడం, అంటే ఆంగ్లేయుల నుండి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం అని పూరి చెప్పారు. పలు రాకాల పరిశ్రమలు రైల్యే ట్రాక్‌లు, షిప్‌యార్డులు, విమానాశ్రయాలు ఇలా చెప్పుకుంటే పోతే బ్రిటిషర్లు నెలకొల్పినవి అనేకం. ఇలా చేయాలంటే ఎంతో కసి ఉండాలంటున్నారు ఈ డైరెక్టర్.
అయితే కాల క్రమేణ స్థానిక దేశాల ప్రజల స్వాతంత్ర్య పోరాటాలు, ఇంకా పలు కారణాలతో ఒక్కో దేశానికి వరుసగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ వెళ్ళారు బ్రిటిషర్లు. అయితే హాకాంగ్ దేశ ప్రజలు మాత్రం, మా దేశాన్ని పాలించాలని లేకుంటే అక్కడి అభివృద్ధి ఆగిపోతుందని అడగడంతో, ఆ దేశాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్న బ్రిటిషర్లు, ఆ దేశాన్ని అభివృద్ధి చేసిన అనంతరం 1997లో స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళారని, నాడు బ్రిటీష్ పాలన కారణంగానే హాంకాంగ్ అభివృద్ధి చెందిదని పూరి తెలిపారు. చివరిగా చెప్పాలంటే ఒక మంచి విషయం, మన శత్రువులో ఉన్నా కచ్ఛితంగా నేర్చుకోవాలని పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్‌లో చెప్పారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!