Ustaad Bhagat Singh: పవన్‌కి విలన్‌గా మల్లారెడ్డిని అడిగారట.. శనివారం వైరల్‌ కామెంట్‌ ఇదే!

(Ustaad Bhagat Singh) తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చాలా డిఫరెంట్‌ పర్సనాలిటీ. ఆయన మాటల్లో ఏదో తెలియని వెటకారం ఉంటుంది. చెప్పే విషయంలో ప్రత్యేకత కూడా ఉంటుంది. అందుకే ఆయన ఫేమస్‌. అలాటి మంత్రి సినిమా ప్రోగ్రామ్‌కి వచ్చి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎందుకంటే ఆయన మాట్లాడింది పవన్‌ కల్యాణ్‌ సినిమా గురించి. ఆయన వచ్చిన ఈవెంట్‌కి, ఆయన చెప్పిన మాటలకు సంబంధం లేకపోయినా.. ఆయన ఫేమస్‌ అయిపోయారంతే. శనివారం రాత్రి జరిగింది ఈ సందడంతా.

యూట్యూబ్‌ నటుడు సుమంత్‌ ప్రభాస్‌ నటించిన ‘మేమ్ ఫేమస్‌’ అనే సినిమా టీజర్‌ లాంచ్‌ ఇటీవల జరిగింది. దానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్ సినిమా గురించి మాట్లాడారు. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో తనను విలన్‌గా నటించమని దర్శకుడు హరీష్‌ శంకర్‌ కోరారని మల్లారెడ్డి తెలిపారు. హరీష్ శంకర్ తన దగ్గరకి వచ్చి పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా నటిస్తారా… అని గంటన్నర బ్రతిమిలాడాడని చెప్పుకొచ్చారు.

అయితే తాను విలన్‌ పాత్రల్లో నటించనని చెప్పినట్లు మల్లారెడ్డి తెలిపారు. సినిమాల గురించి మ‌ల్లారెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. నిర్మాతగా మారతానని, సినిమాలు చేస్తానని చెప్పారు. అయితే నటిస్తాను అని ఎక్కడా చెప్పింది లేదు. అలాంటి వ్యక్తిని హరీశ్‌ శంకర్‌ ఎందుకు అడిగారు అనేది ఓ డౌట్‌. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో మొదలవుతుంది. ఇటీవల టీమ్‌ అంతా కలసి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్పీడ్‌ పెంచారు.

ఆర్ట్‌ డైరక్టర్‌ ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారట. కాలేజీ సెట్‌, క్యాంటీన్‌ సెట్‌ అంటూ కొన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ 90 రోజుల కాల్‌షీట్లు కేటాయించారని టాక్‌. అంటే సుమారు నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలా చూస్తున్నారట. అలాగే ఈ సినిమాతోపాటు సుజీత్‌ – డీవీవీ దానయ్యల ‘ఓజీ’ (వర్కింగ్‌ టైటిల్‌) కూడా షూటింగ్‌ జరుపుకుంటుంది అని టాక్‌.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus