Perni Nani, Balayya Babu: బాలయ్య కలవాలని కోరితే జగన్ అలా అన్నారా?
- February 25, 2022 / 08:19 PM ISTByFilmy Focus
బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రిలీజ్ సమయంలో ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఈ సినిమాకు ఎలాంటి కఠిన ఆంక్షలు ఎదురవలేదు. అయితే బాలయ్య కొన్నిరోజుల క్రితం తాను పరిమిత బడ్జెట్ లోనే సినిమాలను తీస్తానని సీఎం జగన్ ను సినిమాల విషయంలో కలవాల్సిన అవసరం లేదని తన పారితోషికం కూడా ఎక్కువ కాదని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

హిందూపురం అభివృద్ధి గురించి జగన్ ను కలుస్తానే తప్ప సినిమా టికెట్ల గురించి కలవనని బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే తాజాగా కొందరు జర్నలిస్ట్ లు ఈ వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని దృష్టికి తెచ్చారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ బాలయ్య గారు అలా అన్నారా? అని రివర్స్ లో ప్రశ్నించారు. అఖండ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్లు తనకు నూజివీడు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి కలిశారని పేర్ని నాని వెల్లడించారు.

ఆ సమయంలో నిర్మాతలు బాలయ్యగారు మాట్లాడతారని ఫోన్ నుంచి రింగ్ ఇచ్చారని ఫోన్ చేయకుండా రింగ్ ఇచ్చారేంటని ప్రశ్నించగా బాలయ్య ముహూర్తం చూసి ఫోన్ చేస్తారని చెప్పారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాలయ్య జగన్ ను కలవాలని తనను కోరారని తాను అదే విషయాన్ని జగన్ కు చెప్పానని మంత్రి తెలిపారు. సీఎం జగన్ ఎందుకని అడగగా అఖండ రిలీజ్ గురించి మాట్లాడాలని బాలయ్య కాల్ చేశారని చెప్పానని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

నన్ను కలిస్తే బాలయ్య గౌరవం తగ్గుతుందని ఆయనతో మీరే మాట్లాడాలని జగన్ అన్నారని పేర్ని నాని కామెంట్లు చేశారు. బాలయ్య జగన్ ను కలవనని అన్నారంటే తాను నమ్మనని బాలయ్య అబద్ధం చెప్పే మనిషి కాదని పేర్ని నాని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని మంత్రి చెప్పుకొచ్చారు. మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

















