Roja: పబ్ లో ఎంజాయ్ చేస్తున్న మంత్రి రోజా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగి అనంతరం రాజకీయాలలోకి వెళ్లి రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సినీనటి రోజా ఒకరు. ఈమె ప్రస్తుతం ఏపీ పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయాల పరంగా ఎంతో చురుగ్గా ఉండే ఈమె ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినటువంటి రోజా పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి తరుణంలో ఎంతో మంది వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇతర దేశాలకు వెళ్లి పెద్ద ఎత్తున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే మంత్రి రోజా కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులోని ఒక పబ్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఇలా ఈమె పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక ప్రజా ప్రతినిధి అయ్యిండుకొని ప్రజల బాధలను గాలికి వదిలేసి ఇలా పబ్బుల వెంట వెళ్లడంతో పలువురు ఈమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా రోజా పక్కన పెట్టి తన కుటుంబంతో కలిసి ఇలా పబ్ లో ఎంజాయ్ చేయడంతో ఈమె పట్ల ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియోని మరింత వైరల్ చేస్తూ ఈమెపై దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పట్ల తన గురించి వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్లు పట్ల రోజా (Roja) స్పందన ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags