‘హనుమాన్’ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తేజ సజ్జ చేసిన సినిమా ‘మిరాయ్’ (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యింది.రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి స్టార్స్ నటించగా మంచు మనోజ్ విలన్ రోల్ పోషించాడు.
‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ‘మిరాయ్’ కి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
మొదటి వీకెండ్ తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. బయ్యర్స్ అంతా లాభాల బాట పట్టారు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 11.5 cr |
సీడెడ్ | 2.60 cr |
ఉత్తరాంధ్ర | 2.36 cr |
ఈస్ట్ | 1.70 cr |
వెస్ట్ | 0.98 cr |
గుంటూరు | 1.55 cr |
కృష్ణా | 1.45 cr |
నెల్లూరు | 0.72 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 22.86 cr(షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ | 4.72 cr |
ఓవర్సీస్ | 7.44 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 35.02 cr(షేర్) |
‘మిరాయ్’ (Mirai) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.35.02 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.6.52 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం హాలిడే ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. గ్రాస్ పరంగా రూ.60 కోట్లు కొల్లగొట్టింది.