Manchu Manoj: రీ ఎంట్రీ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చిన మనోజ్!

‘హనుమాన్’ (Hanu-Man) తర్వాత తేజ సజ్జ (Teja Sajja) హీరోగా ‘మిరాయ్’ (Mirai)   అనే చిత్రం రూపుదిద్దుకుంటుంది. ‘ఈగల్’ (Eagle) ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) ఈ చిత్రానికి దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad), వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో ‘బ్లాక్ స్వర్డ్’ అనే పాత్రలో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా నటిస్తున్నాడు.

ఇది మనోజ్ కి రీ ఎంట్రీ మూవీ. 6 ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మనోజ్. అతని పాత్రని పరిచయం చేస్తూ ఈరోజు ఓ గ్లింప్స్ ని వదిలారు మేకర్స్. లాంగ్ హెయిర్ తో ఈ గ్లింప్స్ లో మనోజ్ చాలా మాస్ గా కనిపించాడు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కత్తితో ఫైట్ తోనే అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎలివేట్ చేశారు. మనోజ్ పాత్రలో ఇంటెన్సిటీ కూడా కనిపిస్తుంది అని చెప్పాలి.

గ్లింప్స్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ గ్లింప్స్ లాంచ్ లో మనోజ్ మాట్లాడుతూ.. ‘ ‘మిరాయ్’ 2 పార్టులుగా వస్తుంది అని క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తన పాత్రని బాగా డిజైన్ చేశాడని ఈ సందర్భంగా మనోజ్ చెప్పడం జరిగింది. అయితే ‘2 పార్టులుగా ఈ సినిమా ఉంటుంది అని చిత్ర బృందం ప్రకటించలేదని మనోజ్ లీక్ చేశాడని’ అంతా అనుకుంటున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus