గత రెండు,మూడు రోజులుగా క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్ స్టార్ హీరో అయిన టామ్ క్రూజ్ అలాగే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఓకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని వార్తలు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తెగ సంతోషపడుతూ ఈ టాపిక్ ను ట్రెండ్ చేశారు.
ఈ విషయం పై ఓ నెటిజెన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ ని ట్యాగ్ చేస్తూ.. ‘ప్రభాస్ తో మీ సినిమా నిజమేనా?’ అంటూ అతన్ని ట్విట్టర్లో ప్రశ్నించాడు. అందుకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ వెంటనే రంగంలోకి దిగి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ విషయంపై స్పందిస్తూ…’ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదు. అతను చాలా ప్రతిభావంతుడైన నటుడు. ఆయన గురించి చాలా విన్నాము కానీ ఆయన్ని మేము ఎప్పుడూ కలవలేదు. వెల్కమ్ టు ఇంటర్నెట్’ అంటూ ట్వీట్ చేశాడు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. అయినప్పటికీ ప్రభాస్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ కు కూడా నాలెడ్జ్ ఉండడం.. అంతేకాక ప్రభాస్ ను ప్రతిభావంతుడైన నటుడు అని పేర్కొనడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్..మరోపక్క ‘ఆదిపురుష్’ మరియు ‘సలార్’ వంటి చిత్రాలలో నటిస్తుండడం విశేషం.
While he‘s a very talented man, we’ve never met.
Welcome to the internet. https://t.co/mvVFP6N4zV
— Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021
Most Recommended Video
10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!