“అర్జున్ రెడ్డి” సినిమాతో విజయ్ దేవరకొండతోపాటు ఓవర్ నైట్ స్టార్ గా మారిన నటుల్లో రాహుల్ రామకృష్ణ ప్రధముడు. ఆ సినిమాలో స్నేహితుడు శివ పాత్రలో అత్యంత సహజంగా నటించిన రాహుల్ రామకృష్ణకు రాత్రికి రాత్రే స్టార్ కమెడియన్ మరియు మోస్ట్ వాంటెడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత “గీతా గోవిందం”లోనూ మంచి పాత్ర దొరకబుచ్చుకున్నాడు. బేసిగ్గా థియేటర్ ఆర్టిస్ట్ కావడంపాటు ఖాతాలో మంచి హిట్స్ ఉండడంతో రాహుల్ రామకృష్ణ బిజీ కమెడియన్ అయిపోయాడు.
అయితే. రాహుల్ రామకృష్ణ పైకి కనిపించినంత మంచి వ్యక్తి కాదని, తన కెరీర్ తోపాటు సినిమా కూడా పాడవ్వడానికి కారణమయ్యాడని, అబద్ధాలకోరు, టైమ్ సెన్స్ లేదు, నిర్మాతల డబ్బు అంటే గౌరవం లేదు అని భారీ స్థాయిలో ఎలిగేషన్స్ చేశాడు “మిఠాయి” దర్శకుడు ప్రశాంత్. “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రంతోపాటుగా విడుదలైన “మిఠాయి” బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. కనీసం ప్రమోషన్స్ కి ఖర్చు చేసిన మొత్తం కూడా తిరిగిరాలేదు. అయితే.. అప్పుడు తప్పంతా నాదేనని నింద తనపై వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ ఇప్పుడు తప్పంతా రాహుల్ రామకృష్ణదేనని, షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పెట్టాడని ఒక 20, 30 పేజీల లేఖ రాశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లెటర్ వైరల్ అవుతోంది.