డెబ్భై ఏళ్ల నటుడితో శృతి రొమాన్స్!

  • January 17, 2021 / 08:43 PM IST

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ కెరీర్ ఆరంభంలో అన్నీ కమర్షియల్ సినిమాల్లోనే నటించింది. గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ ‘క్రాక్’ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శృతికి అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తనకంటే రెట్టింపుకి మించి వయసున్న నటుడు మిథున్ చక్రవర్తికి జోడీగా శృతిహాసన్ నటించబోతుంది.

డెబ్భై ఏళ్ల వయసున్న మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ‘ది బెస్ట్‌ సెల్లర్ షయీ రోట్‌’ అనే నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. పెద్ద వయస్కుడు, పేరున్న నవలా రచయితకు.. అతడి అభిమాని అయిన ఓ యువతికి మధ్య జరిగే రొమాంటిక్ లవ్ స్టోరీనే ఈ కథ ప్రధానాంశం. ఇందులో నవలా రచయితగా మిథున్ చక్రవర్తి నటించనుండగా.. అతడి ప్రేయసిగా శృతిహాసన్ నటించనుందట. నిజానికి ఇలాంటి పాత్రల్లో నటించడానికి స్టార్ హీరోలు అంత సులువుగా అంగీకరించరు.

కానీ శృతి మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకుంది. మరి ఈ పాత్రతో శృతి ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి. ముకుల్ అభ్యంకర్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనుండగా.. సిద్ధార్థ్ పి. మల్హోత్రా నిర్మించనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో చిత్రీకరణ జరగనున్న ఈ సిరీస్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus