Mitraaw Sharma: మిత్రా ఎందుకు డల్ అయ్యింది..! అసలు కారణం ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో ఈసారి తనదైన స్టైల్లో ఆడియన్స్ ని ఆకర్షించింది మిత్రా. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు తను చేసే చేష్టలు, మాట్లాడే మాటలు ఆడియన్స్ కి బాగా నచ్చాయి. అయితే, లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు బిందు తనని ఫిజికల్ గా ఎటాక్ చేస్తోందని చెప్పిన మాటలకి నాగార్జున క్లాస్ పీకారు. అస్సలు ఫిజికల్ ఎటాక్ అనేది లేదని, అది కేవలం అటెన్షన్ కోసమే బిందు అలా చేసిందని మిత్రాకి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది.

అయితే, నాగార్జున సర్ ప్రైజ్ గా మిత్రాకి వాళ్ల నాన్న ఫోటోని పంపారు. ఇది చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయిపోయింది మిత్రా. అయితే, ఈ పోటో వెనక కథేంటి అనేది చాలామందికి తెలియదు. నిజానికి చిన్నప్పుడే మిత్రా శర్మా తల్లిదండ్రులని పోగొట్టుకుంది. అందుకే, వాళ్ల నాన్న ఫోటో చూడగానే భోరున ఏడ్చేసింది. అంతకుముందే ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిలోకి వచ్చేటపుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. ముఖ్యంగా బిందు మాధవి వాళ్ల నాన్నని చూసిన తర్వాత తనకి వాళ్ల ఫాదర్ గుర్తుకు వచ్చారు.

అందుకే, బిగ్ బాస్ టీమ్ సర్ ప్రైజ్ గా మిత్రా నాన్న పోటోని పంపించారు. గతవారం నామినేషన్స్ అప్పుడు తనని బిందు మాధవి టార్గెట్ చేసి మరీ మాట్లాడుతుంటే మిత్రా శర్మా వాటిని ఖడించింది. అంతేకాదు, తనని ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నా కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా రియాక్ట్ అవ్వకుండా నుల్చుంది. ఈ నామినేషన్స్ ప్రక్రియలో తను చాలా డల్ గా కనిపించడానికి కారణం ఇదే. ఆదివారం ఎపిసోడ్ లో తనని సపోర్ట్ చేసేందుకు సిరి హన్మంత్, గంగాధర్ ఇద్దరూ కూడా స్టేజ్ పైకి వచ్చి బూస్టప్ ఇచ్చారు.

అయినా కూడా నామినేషన్స్ లో డల్ గా కనిపించింది. మిత్రాని టార్గెట్ చేస్తూ బిందు ఓవర్ యాక్షన్ చేస్తున్నా కూడా ఎక్కడా రియాక్ట్ అవ్వకుండా, తను అనుకున్న పాయింట్ ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది. అందుకే, మిత్రాకి సపోర్ట్ గా వచ్చిన గంగాధర్ కూడా ఇవే మాటలు చెప్పాడు. తను సివంగి అని, అలాగే గేమ్ ఆడుతోందని, బయట ఎలా ఉంటుందో, ఇంట్లో కూడా అలాగే ఉందని చెప్పాడు.

అంతేకాదు, ఇంటి సభ్యులతో టాస్క్ ఆడించడానికి వచ్చిన సిరి హన్మంత్ కూడా మిత్రా గేమ్ చాలా బాగుందని, ఇలాగే ఆడమని సలహా ఇచ్చింది. బయట వాళ్లు కానీ, ఇంట్లో వాళ్లు కానీ ఎన్ని మాటలు అన్నా అవేమీ పట్టించుకోవద్దని, ఖచ్చితంగా నీ గేమ్ పైన ఫోకస్ పెట్టమని సలహా ఇచ్చింది. నామినేషన్స్ లో డల్ గా ఉన్న మిత్రా ఇప్పుడు సిరి హన్మంత్ చెప్పిన మాటలతో తిరిగి ఉత్సాహాన్ని నింపుకుంది. ఎవిక్షన్ పాస్ టాస్క్ లో ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus