Salman: ‘భాయ్‌..జాన్‌’ కొత్త పాట విన్నా, చూసినా అదో రకం.. మరి థియేటర్‌లో..!

‘ఏంటమ్మా..’ అంటూ ఓ పాట వస్తుంది.. అందులో ఓ స్పెషల్‌ అప్పీయరెన్స్‌ ఉంది అంటూ కొన్ని రోజుల క్రితం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమా టీమ్‌ ఓ చిన్న టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్‌లో స్పెషల్‌ రామ్‌చరణే అని ఫ్యాన్స్‌ ఈజీగా గుర్తు పట్టేశారు. అనుకున్నట్లుగా పాట వచ్చింది, అందులో చరణ్‌ కూడా వచ్చాడు. అందరికీ ఇన్‌స్టంట్‌గా నచ్చేశాడు కూడా. అయితే పాట బీట్‌ బాగుంది కాబట్టి.. సరిపోయింది కానీ ఆ కిచిడీ ఏంటో అర్థం కావడం లేదు అని చెప్పొచ్చు.

సల్మాన్ ఖాన్ (Salman) హీరోగా తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. తమిళంలో అజిత్‌ హీరోగా తెరకెక్కిన ‘వీరమ్’ సినిమాకు ఇది రీమేక్‌ అని టాక్‌. అదేనండీ తెలుగులో పవన్‌ కల్యాణ్‌ చేసిన ‘కాటమరాయుడు’. ఆ సినిమాల కథలకు చిన్నపాటి మార్పులు చేసి హిందీకి తగ్గట్టుగా తెరకెక్కించారట. మాతృకతలో హీరోయిన్‌కి తండ్రి పాత్రను హిందీకి వచ్చేసరికి సోదరుడు చేసేశారు. ఈ సినిమాలో ఆ పాత్రను వెంకటేశ్‌ పోషిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా సినిమా క్రేజ్‌ సంపాదించేలా తెలుగు పాట పెట్టారు.

తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాట ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కిచిడీ పాట వచ్చింది. ఇది సౌత్‌ మిక్స్‌డ్‌ అని చెప్పొచ్చు. అంటే తెలుగు, తమిళ పదాల్ని హిందీకి కలిపి ‘ఏంటమ్మా..’ అనే సాంగ్‌ చేశారు. ఈ పాట వింటుంటే నానా రకాలుగా ఉంది అని అంటున్నారు ఫ్యాన్స్‌. అంటే హిందీ బీట్‌, తమిళ వాసన, తెలుగు స్టెప్పులు అంతా కలిపి ఓ కిచిడీ మాదిరి ఉంది అని చెప్పొచ్చు.

నాటు నాటు స్టెప్‌, లుంగీ డ్యాన్స్‌ స్టెప్పులు ఈ పాటలో కనిపిస్తున్నాయి. ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్ 21న విడుదల చేస్తున్నారు. అప్పుడు కేవలం పాటలే మిక్సింగా? మొత్తం సినిమానే మిక్సింగా అనేది తెలుస్తుంది. ఏదైతేముంది చరణ్‌ స్టెప్పులతో పాటకు భలే బజ్‌ వచ్చింది అని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus