యాక్షన్ కింగ్ అర్జున్ కి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సూపర్ హిట్ తమిళ సినిమా జెంటిల్ మెన్. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో 1993లో విడుదల చేశారు. శంకర్ మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత జెంటిల్‌మన్ నిర్మాత కుంజుమోన్ అప్పట్లో సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అంధించగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అయితే ఆ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
అయితే సినిమాకి సంబంధించిన సీక్వెల్ మళ్ళీ పాతికేళ్ల అనంతరం చర్చల్లోకి వచ్చింది. నిర్మాత కుంజుమోన్ అధికారికంగా అదే బ్యానర్ లో సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు శంకర్, అర్జున్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ లేకుండానే మొదటి పార్ట్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రానికి MM కీరవాణి సంగీతం అందించనున్నట్లు నిర్మాత ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సంగీత దర్శకుడి ప్రకటన గురించి అభిమానులను ముందుగా కాస్త టెంప్ట్ చేశారు.
ఎట్టకేలకు ఈ రోజు ఎంఎం కీరవాణి చిత్రంలో భాగమవుతాడని వెల్లడించాడు. కీరవాణిని కోలీవుడ్‌లో మరగతమణి అని పిలుస్తారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిని చిత్ర నిర్మాత ఇంకా ఖరారు చేయలేదు. మొదట్లో నిర్మాత అల్లు అర్జున్ లాంటి హీరోను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు అతను మరో పాన్-ఇండియా అప్పీల్ ఉన్న ప్రముఖ నటుడితో చర్చలు జరుపుతున్నాడని సమాచారం.
జెంటిల్‌మన్‌తో తమిళ చిత్రసీమలో శంకర్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఇప్పుడు ఆయన స్థానంలో కీరవాణి సీక్వెల్‌ను తీసుకోనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.