MM Keeravani: మీపై ఆస్కార్‌ ప్రభావం ఏంటి అంటే… కీరవాణి వైరల్‌ కామెంట్స్‌!

  • January 9, 2024 / 12:15 PM IST

ప్రపంచ సినిమా పరిశ్రమలో మేటి పురస్కారం అంటే ఆస్కార్‌ అని అంటుంటారు. ఆ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా నటులు, సాంకేతిక నిపుణులు కష్టపడుతుంటారు. ఏటా తమ సినిమాలతో ఆస్కార్‌ బరిలో నిలిచి కడదాక పోరాడుతుంటారు. ఆస్కార్‌ విజయం వస్తే వాళ్ల పడ్డ ఆనందానికి అవధులు లేవు అని చెబుతుంటారు. అంతలా ఆస్కార్‌కి ఎలివేషన్లు ఇస్తుంటారు. అలాంటి పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాత్రం లైట్‌ తీసుకుంటున్నారు అనిపిస్తోంది.

అంటే, ఆస్కార్‌ పురస్కారాన్ని ఆయన తక్కువ చేయడం లేదు కానీ, ఆస్కార్‌ వల్ల తన జీవితంలో, తన జీవితంలో పెద్దగా మార్పులేమీ లేవు అని చెబుతున్నారు. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగా’. విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆస్కార్‌ ప్రభావం గురించి మాట్లాడారు.

మామూలుగా ఏ సినిమాకైనా హైప్‌… పాటల ద్వారానే వస్తుంది. ఆ పాటలు జనాలకు ఏమాత్రం నచ్చేసినా సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అంతే కానీ నాకు ఆస్కార్‌ వచ్చిందనో, మా ఇంట్లో కుక్క పిల్లకు బంగారు కంకణం తొడిగారనో సినిమా మీద హైప్‌ రాదు అని అన్నారు కీరవాణి. అంతేకానీ ఓ సినిమా విజయానికి ఆస్కార్‌ కొంచెం కూడా పని చేయదు. సినిమాను దర్శకుడు బాగా తీయాలి. నా పాటలు బాగా కుదరాలి. అవి జనాలకు నచ్చాలి అని క్లారిటీ ఇచ్చారు కీరవాణి.

ఇక తన (MM Keeravani) మీద ఆస్కార్‌ ప్రభావం గురించి మాట్లాడుతూ… ఆస్కార్‌, పద్మశ్రీ ఇలా ఏ పురస్కారం అయినా సరే నాపై పాజిటివ్‌గా కానీ, నెగటివ్‌గా గానీ ప్రభావం చూపించలేదు అని అన్నారు. తనకు ఆస్కార్‌ వస్తే బాగుండు అనే ఆలోచన ఎప్పుడూ లేదు. తనకు అవార్డులు అంటే పెద్దగా గౌరవం లేకపోవడమే దానికి కారణమట. అయితే ఆస్కార్‌కు ముందు ‘మీరు ఆస్కార్‌ తీసుకురండి’ అని రామోజీరావు అన్నారు. ఆయన లాంటి వ్యక్తి ఆస్కార్‌కు గౌరవమిస్తున్నారంటే దానికో విలువ ఉందనిపించింది. అప్పుడే ఆ అవార్డు సాధించాలనే ఆలోచన వచ్చింది అన్నారు కీరవాణి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus