ప్రముఖ నటికి క్యాన్సర్..ఎదురుదెబ్బలు అంటూ ఎమోషనల్ పోస్ట్..!

ఎంతటి సెలబ్రిటీలు అయినా వాళ్ళు మనుషులే, వారిది రంగుల ప్రపంచంలో కనిపించినా అందులో కూడా చీకటి (డార్క్) అనేది ఏర్పడుతుంది అని ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు అందరూ పూర్తిగా ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పలేం. ఈ మధ్య కాలంలో సమంతతో పాటు కొంతమంది నటీనటులు తాము ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టారు. మరికొంతమంది అయితే అనారోగ్యంతో మరణించారు కూడా! ఇప్పుడు మరో నటి కూడా క్యాన్సర్ కి గురవ్వడంతో హాస్పిటల్ పాలైంది.

దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ భామ రోజాలిన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడిందట. దీంతో ఆమె హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ ను పెట్టింది. ‘ప్రతి ఎదురుదెబ్బ నన్ను బలంగా మారుస్తుంది. నాకు కచ్చితంగా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. వచ్చే 7 నెలల్లో కీమో థెరఫీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సెషన్ ముగిసాక రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ఆమె ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

ఆ పోస్టును చదివిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెట్టారు. ఈమె వయసు 34 సంవత్సరాలు. ధమ చౌక డి, సవిత బాబి, జీ లేనే దో ఏక్ పాల్ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. అలాగే బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్ క్రైమ్ అలర్ట్ లో లీడ్ యాక్ట్రెస్ గా నటించింది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus