ఈ సంవత్సరమైనా ప్రభాస్ ఓ ఇంటివాడు కావాలని కోరుకున్న మోహన్ బాబు
- May 4, 2017 / 05:40 AM ISTByFilmy Focus
వెండితెర అద్భుతం బాహుబలికి అభినందనల వర్షం కురుస్తూనే ఉంది. నిన్న ఈ సినిమాని చూసిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆనందంతో డైలాగులు అదరగొట్టారు. ట్విట్టర్ వేదికపై ప్రశంసలు గుప్పించారు. “భారతదేశంలో తెలుగు ప్రజలున్నారని అన్నయ్య నందమూరి తారక రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఒక గొప్ప తెలుగు దర్శకుడున్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావ్. అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు నీకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను” అని జక్కన్నని అభినందించారు.”ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో ‘విశ్వ విజయేంద్ర ప్రసాద్’ గా సార్థక నామధేయుడివి అయ్యావ్. ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను.” అని సంతషం వ్యక్తం చేశారు.
“బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను.” అంటూ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇలా పేరు పేరునా బాహుబలి బృందాన్ని అభినందించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















