టాలీవుడ్ నాశనం అయిపోతుంది….నష్టాల్లో నడుస్తుంది…కష్టాల పాలవుతుంది…ఇవన్నీ మన ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం…అయితే ఈ ఫలితాలకి కారణం ఎవరు? అసలు ఈ స్థితికి…పరిస్థితికి ఎవరు కారకులు? అంటే….నిర్మాతలే అంటున్నారు మన మంచు మోహన్ బాబు గారు…మంచి మోహన్ బాబు మాట్లాడుతూ…మన పరిశ్రమ దిగజారిపోవడానికి ప్రధాన కారణం మన నిర్మాతలే అని చెబుతున్నాడు. బడ్జెట్లు పెరిగిపోవడానికి, హీరోలు దర్శకుల వెంట పడి వారికి అయినకాడికి పారితోషకాలు ఆఫర్ చేయడం ద్వారా.. పరిశ్రమ నాశనానికి కారణమవుతున్నారని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా నిర్మాతల బ్రతుకులు చాలా దయనీయంగా మారింది అని, దానికి కారణం ఏంటి అంటే…ఓ దర్శకుడు హిట్టు కొట్టగానే అతడి చుట్టూ తిరగడం….కాల్ షీట్స్ కోసం వెంటపడడం… ఓ దర్శకుడు రూ.50 లక్షలకు అర్హుడైతే రూ.మూడు కోట్లు ఇవ్వడం. దీంతో ఆ దర్శకుడు రూ.10 కోట్లతో సినిమా తీయాల్సింది రూ.60 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తెయ్యడం….ఇదే జరుగుతుంది అని….ఈ డబ్బు అంతా బ్లాక్ మనీ కావడంతో సినిమా విలువ కోల్పోతుంది అని అంటున్నాడు మన కలెక్షన్ కింగ్. అంతేకాకుండా…కలెక్షన్ల విషయంలో నిర్మాతలు వినిపించే లెక్కలన్నీ గ్యాసే అని వాళ్లు చెబుతున్న అంకెలు వేరు. వాస్తవం వేరు’’ అని మోహన్ బాబు తెలిపాడు…ఇక తన విషయానికి వస్తే….ఇంతే ఇవ్వగలను అని ముందే చెబుతానని.. ఇస్తానన్నది టైమ్ కి ఇస్తాను అని, వ్వరికీ పైసా ఎగ్గొట్టకుండా పక్కాగా ఉంటున్నానని, అదే క్రమంలో….విజయాలు వచ్చినప్పుడు పొంగి పోయి…అపజయాలలో కుంగిపోయే మనస్తత్వం నాది కాదు అని తెలిపాడు.