Mohan Babu, Pawan Kalyan: ”నువ్ అడిగిన ప్రతిమాటకీ నేను సమాధానం చెబుతా”
- September 27, 2021 / 05:59 AM ISTByFilmy Focus
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం నాడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ, రాజకీయ అంశాలపై స్పందించారు. తేజు యాక్సిడెంట్ విషయంలో మీడియా చేసిన అతిపై చురకలు అంటించారు. థియేటర్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలంతా ఒక్క మాటపై నిలబడాలని సూచించారు. ఇదే సమయంలో మోహన్ బాబుని మధ్యలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
వైసీపీ వాళ్లు థియేటర్లు మూసేసినప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలని అన్నారు. ఎందుకంటే ‘వైఎస్ కుటుంబీకులు మా బంధువులు’ అని మీరు చెబుతుంటారు కదా. నేను విన్నాను.. ఇండస్ట్రీని హింస పెట్టొద్దని వారికి చెప్పండి అంటూ పవన్.. మోహన్ బాబుని ఉద్దేశిస్తూ అన్నారు. అలానే ‘మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకుంది’ అని పవన్ అన్నారు. తాజాగా ఈ విషయంపై మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు.

”నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్‌గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్.. మోహన్‌బాబు” అని ట్వీట్ చేశారు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!














